ప్రజాశక్తి - తణుకు రూరల్
విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో కొలుసు ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ చిత్ర కళా ప్రదర్శన జరిగింది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలభై మంది చిత్రకారులు వారు చిత్రించిన చిత్రాలు ప్రదర్శించారు. ఈ మేరకు చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు 'ఇన్ మెడిటేషన్' శీర్షికతో కాంటెంపరరీ శైలిలో చిత్రించిన పెయింటింగ్ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, కొలుసు ఆర్ట్ ఫౌండేషన్ ఫౌండర్ కొలుసు సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపల్, ఫైనార్ట్స్ డిపార్ట్మెంట్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇ.శ్రీనివాస రెడ్డి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సిఇఒ ఇ.శివ నాగిరెడ్డి, ప్రెసిడెంట్ స్టేట్ బిసి వెల్ఫేర్ అసోసియేషన్ ఎల్.వెంగళరావు యాదవ్, గొల్ల నారాయణరావు, ప్రముఖ చిత్రకారుడు శిల్పి శేషబ్రహ్మం, అల్లు రాంబాబు వెంపటాపును ప్రశంసాపత్రం, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తణుకు జెడ్‌పి బాలుర హైస్కూల్ హెచ్‌ఎం కోట శివ ప్రసాద్, టి. ఉమ, జిజె.ప్రభువరం, కనకదుర్గేశ్వరి, సీతామహాలక్ష్మి, వీరభద్రం ఆయనను అభినందించారు.










