Oct 14,2023 21:27

ఫొటో : చిన్నారులను అభినందిస్తున్న దృశ్యం

చిన్నారులకు అభినందనలు
ప్రజాశక్తి-కావలి : నెల్లూరు నగరంలోని టౌన్‌ హాల్‌లో ''నెల్లూరు జిల్లా డ్యాన్స్‌ మాస్టర్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌'' నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో కావలి పట్టణం సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు లిఖిత, వారి శిష్య బృందం మనస్వి, శివ నాగేశ్వరి, దుర్గా పావని, షమియ, గాయత్రి, హరిణి, మోక్ష, సాయి, జెన్యలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చేసిన నృత్యంపై పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోని అనేక మంది కళాకారులు పాల్గొని నృత్య ప్రదర్శనలు చేశారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త అమరావతి.క్రిష్ణారెడ్డి, శివాజీ యూత్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌.మోపూరు.భాస్కర్‌ నాయుడు, నెల్లూరు జిల్లా డ్యాన్స్‌ మాస్టర్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు, కావలి డ్యాన్స్‌ మాస్టర్స్‌, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు లిఖిత, వారి శిష్య బృందం చేసిన నృత్యం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. చూపరులను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు. నేటి సమాజంలో ప్రజల్లో చైతన్యం కోసం ఇటువంటి నృత్యాలు చేయడం ఎంతో అవసరమని తెలిపారు. దానివల్ల కొంతమందిలోనైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. నృత్య ప్రదర్శన ఇచ్చిన లిఖిత గ్రూప్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సంయుక్త సేవాసంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవల గురించి అందరికీ తెలియజేసి, సంస్థ సేవలను ప్రత్యేకంగా అభినందించారు.