Mar 22,2022 23:47

10వేలు అందిస్తున్న పార్థసారధినాయుడు


ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌:
యాదమరి మండలం కొట్టాల గ్రామానికి చెందిన మురళి, మీనా దంపతులకు కుమారుడు జ్ఞానసాయి వైద్య చికిత్స కోసం సమాజిక సేవకులు పార్థసారధి నాయుడు తనవంతు ఆర్థిక సాయంగా రూ. 10వేలు మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో అందించారు. ఈ సందర్భంగా పార్థసారధినాయుడు మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్య చికిత్స నిమిత్తం దయగల దాతలు స్పందించి వారికి మరింత సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.