మృతి చెందిన యశ్వంత్
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి:
బైరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని మరిమానుచేను గ్రామానికి చెందిన రజని, రేణుకా కుమారుడు యస్వంత్ (9) స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో గ్రామ చివారున కుదురిగానిగుట్ట చెరువులో ఈత కోట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా కొంత మంది యువకులు నీటిలో ఉన్న యశ్వంత్‌ను బయటకు తీసి ద్విచక్ర వాహనంలో బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు యశ్వంత్ చనిపోయాడని నిర్ధారించారు.










