Sep 25,2023 00:13

చీని , డ్రాగన్‌ ఫ్రూట్స్‌ పంటల పరిశీలన


చీని , డ్రాగన్‌ ఫ్రూట్స్‌ పంటల పరిశీలన
ప్రజాశక్తి - గంగాధర నెల్లూరు: గంగాధరనెల్లూరు మండలంలోని పాపిరెడ్డి పల్లి పంచాయతీ లోని చీని , డ్రాగన్‌ ఫ్రూట్స్‌ పంటలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రెడ్డి రామ్‌ , విస్తరణ శాస్త్రవేత్త రాఘవేందర్‌ రెడ్డిలు కలిసి పాపిరెడ్డి పల్లె లో చీని, డ్రాగన్‌ పంట రైతులతో మాట్లాడారు. అనంతరం చీని, డ్రాగన్‌ ఫ్రూట్స్‌ పంటలకు ఎల్లో మోజాయిక్‌ వైరస్‌ నివారణకు రోగోర్‌ 1 లీటర్‌, వేప నూనె ఒక లీటరును 500 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేయాలని సలహాలు, సూచనలు శాస్త్రవేత్తలు రైతులకు తెలిపారు. ఆవిధముగా పిచికారి చేయడం ద్వారా పండ్ల తోటలను దోమలు బెడద నుండి కాపాడుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వందన, గ్రామ వ్యవసాయ సహాయకులు చక్రవర్తి , శిరీష పాల్గొన్నారు.