Feb 26,2022 15:29

ప్రజాశక్తి-వెదురు కుప్పం : రాస్ కృషి విజ్ఞాన కేంద్రము తిరుపతి వారు నంబాల పల్లి  గ్రామములో వెదురుకుప్పం మండలం నందు శనివారం పట్టు రైతుల మల్బరీ తోటలను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి  చీడపీడలు కొరకు వారు ఆచరిస్తున్న పద్ధతులను తెలుసుకున్నారు. పట్టు రైతులు నాణ్యమైన అధిక దిగుబడికి ఆచరించవలసిన యాజమాన్య పద్దతుల గురించి తెలియజేసి మల్బరీలో చీడపీడల నివారణకు వేప నూనె, ఇంటర్ ఫ్రీడ్ అనే మందును వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి పిచికారి చేయాలని ఇరవై రోజుల తరువాత ఆకును పురుగులకు వినియోగించాలని ప్రయోగాత్మకంగా ప్రదక్షిణక్షేత్రంలో కృషి విజ్ఞాన కేంద్రం పట్టు శాస్త్రవేత్త పద్మజ తెలియజేశారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్ర సీనియర్ సైంటిస్ట్ మరియు హెడ్ కెవికే ద్వారా వారు వెదురుకుప్పం మండలంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి తెలియజేసి రైతులు వరిలో మరియు మిరపలో ఎదుర్కొంటున్న సమస్యలకు వారి సందేహాలకు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త రామ్ కుమార్ మరియు పట్టు రైతులు పాల్గొన్నారు.