ఎస్‌ఆర్ పురం (చిత్తూరు) : గుర్తు తెలియని వ్యక్తులు చెరుకుగానుగకు నిప్పు పెట్టడంతో గానుగ షెడ్డు పూర్తిగా దగ్ధమయిన ఘటన సోమవారం అర్థరాత్రి ఎన్‌ఆర్ పురం మండలంలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పద్మనాభ నాయుడు చెరుకు గానుగ షెడ్డుకు గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో గానుగ షెడ్డు దగ్ధమయ్యింది. బెల్లం తయారీకి ఉపయోగించే పరికరాలు కాలిపోయాయి. నిల్వ ఉంచిన బెల్లం పూర్తిగా బూడిదయ్యింది. సుమారుగా రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










