ప్రజాశక్తి-వెదురుకుప్పం: మండలంలోని పెరుమాళ్లపల్లికి చెందిన రాజారెడ్డి తోట విద్యుత్ షార్ట్ సర్కూట్‌తో దగ్ధమైంది. రైతు రాజారెడ్డి మాట్లాడుతూ సుమారు 2.5ఎకరాలలో చెరుకుతోట సాగు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం అకస్మాత్తుగా ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మోటార్‌కు వచ్చే సర్వీస్ వైర్‌లు ష్కార్ట్ సర్కూట్‌తో నిప్పులు చెలరేగాయన్నారు. నిప్పులు చెరుకుతోటకు అంటుకోవడంతో మంటలు వ్యాపించి తోట కాలిపోయిందన్నారు. అప్పటికే ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇచ్చినా అక్కడికి చేరుకొనే లోపే తోట పూర్తిగా దగ్ధమైందని వివరించారు. చేతికొచ్చే పంట కల్లెదుటే మంటల్లో కాలిబూడిదైందని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న టిడిపి నేతలు లోకనాథ్ రెడ్డి, మోహన్ మురళి రాజారెడ్డి పొలాన్ని పరిశీలించారు. కాలిపోయిన పంటకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి రైతును ఆదోకావాలని డిమాండ్ చేశారు. చెంగల్‌పండురెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటేష్ తదితరులు ఉన్నారు.










