Aug 17,2023 22:08

చెరకు రైతు బకాయిలు చెల్లించండి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

చెరకు రైతుల బకాయిలు చెల్లించకుండా చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీని లీజుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘం కోర్టును ఆశ్రయించిన్నట్లు రైతు సంఘం నాయకులు శ్రీనివాసులు నాయుడు, జయరాం నాయుడు, కొత్తూరు బాబు గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం చెరకు రైతుల బకాయిలు పూర్తిగా చెల్లించిన తరువాత షుగర్‌ ఫ్యాక్టరీని లీజుకు ఇవ్వాలని అలా కాకుండా ప్రైయివేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే చెరకు రైతులు బకాయిలు చెల్లించాలని కోరారు. జనరల్‌ బాడీ నిర్వహించి చెరకు రైతుల అభిప్రాయలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.