ప్రజాశక్తి-అనంతపురం సిఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసింది ఏమీ చెప్పుకోలేకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నా రని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ ఎద్దేవా చేశారు. శనివారం స్థానిక సప్తగిరి సర్కిల్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన వ్యవస్థాపకు లు పవన్‌కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థలోని అవకతవకలపై మాట్లాడితే జగన్‌రెడ్డి మూడు పెళ్లిళ్లపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సామాజిక సమస్యలపై అవగాహన లేని సిఎం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్నారు. వారాహి యాత్రకు ప్రజల నుంచి వస్తున్న జనాదరణను చూసి ఓర్చుకోలేని జగన్‌కు మతిస్థిమితం కోల్పోయారన్నా రు. అందుకే పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ముఖ్యమంత్రి కాకముందు కలకత్తా, బెంగళూరులో రాసలీలలు చేసిన విషయం నిజం కాదా.. అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ బటన్ నొక్కడం మానివేసి జవాబుదారి తనంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు ఈశ్వర్, లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, నాగేంద్ర, కిరణ్, సిద్ధు, జయమ్మ, తాతయ్య, ఆదినారాయణ, రాజా, తదితరులు పాల్గొన్నారు.
మహిళలతో మాట్లాడుతున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్










