ప్రజాశక్తి-తిరుపతి సిటి
స్థానిక బాలాజీకాలనీలోని ఎస్‌వి మ్యూజిక్ కళాశాల ఎదురుగా ఉన్న లక్ష్మీనారాయణ కల్యాణమండపంలో జ్యోతిప్రజ్వలనతో ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికులను, చేనేత వస్తువులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన, అమ్మకాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇందులో కళంకారి వస్త్రాలు, పోచంపల్లి, బద్వేల, గాజువాక, ధర్మరవం, మదనపల్లి, వెంకటగిరి, మంగళగిరి, బందరుపేటు, పుల్లంపేట, అంగర, పులగర్త, మాధవరం, కాటన్‌చీరలు, సీకో, టస్సరు సిల్క్ చీరలు, పట్టు చీరలు, టైఅండ్‌డై, గొల్లబామ చీరలు, ధోవతులు, తువ్వాళ్లు, లుంగీలు, మంగళగిరి, చీరాలా డ్రస్ మెటీరియల్స్, పెద్దాపురం సిల్క్, పొందూరు కాటన్ షర్టింగ్, పోచంపల్లి చీరలు, డిజైన్ బెడ్ షీట్స్, వరంగల్ డిరీలు అండ్ డోర్మెట్స్ ఇతర అనేక రకాలైన చేనేత వస్త్రాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 24క నుంచి ఏఫ్రిల్ 8వ తేది వరకు జరిగే ఈ ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మద్య ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, కాశ్మీర్ రాస్ట్రాల నుంచి చేనతే సంఘాల వారు పాల్గొంటారన్నారు. దీన్ని తిరుపతి, పరిసరాలకు చెందిన ప్రజలు సందర్శించి, చేనేతను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంవో ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.










