చేనేత కార్మికుల సంక్షేమానికి
ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
రాష్ట్రప్రభుత్వం నవరత్నాలతో సంక్షేమఅభివద్ధి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతున్నదని వీటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని అభివద్ధిలోనికి రావాలని జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ పేర్కొన్నారు. గురువారం నాలుగో విడత వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంను లాంఛనంగా కష్ణాజిల్లా పెడన నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్‌లో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేశారు. జిల్లాస్థాయి కార్యక్రమం జిల్లా సచివాలయంలోని డిఆర్డిఏ సమావేశం మందిరం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి, చిత్తూరు నగరపాలక మేయర్ అముద, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్. రాజశేఖర్ సంబంధిత అధికారులు, నేతన్నలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అభివద్ధి చేసేందుకు నవరత్నాలు ద్వారా సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడం జరుగుతున్నదని ప్రజలందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివద్ధి చెందాలన్నారు. పథకాలలో మహిళా సంక్షేమం నిమిత్తం మహిళలు ఆర్థిక అభివద్ధి ద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా అభివద్ధి చెందుతాయని ఉద్దేశంతో మహిళలకు ఆర్థిక స్వాలంబనకు ప్రభుత్వం కషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఈ పథకాల ద్వారా అందించే ఆర్థిక సాయంను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. జిల్లాకు సంబంధించి 166 మందికి ఒక్కొక్కరికి 24వేల రూపాయలు చొప్పున ఇందుకు సంబంధించిన 39,84,000 మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి వెంకట్ రాము, ఇతర సంబంధిత అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.










