Oct 21,2023 19:03

గ్రంథాలయంలో చదువుతున్న విద్యార్ధులు

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు శాఖ గ్రంథాలయంలో దసరా సెలవులు సందర్భంగా ఈనెల15 నుంచి 21 వరకు గ్రంథాలయంలో విద్యార్థులకు చదవడం 'మా కిష్టం' కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల చేత కథలు చదివించడం కథలు చెప్పించడం.. పాటలు పాడించడం క్విజ్‌ పోటీ నిర్వహించారు. శనివారం విజేతలన విద్యార్థులకు బహుమతులు అందజేవారు. కేశవ విద్యాలయం మాస్టారు, గౌతమి స్కూలు మాస్టారు గ్రంథ పాలకురాలు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సెలవుల్లో విద్యార్థులు గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని టీచర్స్‌ చెప్పారు.