Aug 23,2022 21:39

చదువుతున్న కోర్సులను బట్టి
ప్రతిభ సాధించేలా ఇంటర్న్‌షిప్‌్‌ : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

నూతన విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్కులను తీసుకురావడం జరిగిందని ఇందులో ఇంటర్న్‌షిప్‌ ప్రధానమైనదని జిల్లా కలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌ అన్నారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌్‌ అమలు చేసే పద్ధతులపై జిల్లా కలెక్టర్‌ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు చెబుతున్న ప్రకారం రెండవ సంవత్సరం నాలుగవ సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు మొత్తం 10,717మంది ఉన్నారని, ఈవిద్యార్థులను ఐదు విభాగాలుగా చేయవచ్చునని వారికి జిల్లాలో లభ్యమయ్యే వివిధ పరిశ్రమలు, సంస్థలు రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు వివిధ సంస్థల పనితీరు పట్ల ఇంటర్న్‌షిప్‌ కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్టర్‌ మహ్మద్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ జిల్లాలోని 64 కళాశాలలో 10,717మంది కల్పించాల్సి ఉందని ఇందులో బిఎస్సి, బిజెడ్‌ సి,(3307 ఎంపీసీ, ఎంపీఈసి, బి ఏ681, కామర్స్‌ కోర్సులు 5,879, లిటరేచర్‌ 501, కంప్యూటర్‌ సైన్స్‌ 349, చేసేవారు ఉన్నారని వారిని ఆయా విభాగాలకు విభజించి బి జెడ్‌సి కోర్సులు చేసే వారికి రైతు భరోసా కేంద్రాల ద్వారా, సిరికల్చర్‌, హార్టికల్చర్‌లపై అవగాహన కల్పించాలన్నారు. ఆ విధంగా చిన్నచిన్న ప్రాజెక్టుల గురించి వారికి లింకేజీ కల్పించాలని అన్నారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ 3307 మంది బిజడ్‌సిలో ఉన్నారని జిల్లా వ్యవసాయ అధికారి జిల్లా అనిమల్‌ హస్బండ్రీ అధికారి, ఉద్యానవనశాఖ అధికారి నోడల్‌ అధికారులుగా అన్నారు. లిటరేచర్‌ 501మంది ఉన్నారని వారికి విద్యాశాఖ అధికారి వారిని పాఠశాలలలో విద్యావిధానంపై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. సైన్స్‌ విభాగంలో జిల్లాలో 502 రైతుభరోసా కేంద్రాలు ఉన్నాయని, మున్సిపాలిటీలు చెత్తసేకరణ గ్రామాలలో పరిశుభ్రత లాంటి విధానాలతో పాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పనితీరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న పనితీరుపై అవగాహన కల్పించవచ్చునని అన్నారు. రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేయడం జరుగుతుందని అన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 5879 మంది ఉన్నారని డేటా ఎంట్రీ తహశీల్దార్‌, ఎంపీడీవోలు, గ్రామ సచివాలయాలు, ఇతర సంస్థలలో కంప్యూటర్లు సాఫ్ట్వేర్లను తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మరో విభాగంలో హెచ్‌ఈపీ చదువుకున్న వారికి ప్లానింగ్‌ సెక్షను ఎండోమెంట్‌, సిపిఓలతోపాటు గ్రామాలలో జరుగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అమలు అవుతున్న తీరు గురించి తెలిసేలా ఉండాలన్నారు. జిల్లాలో ఉన్న ఎంఎస్‌ఎంఈలు పలువురికి అవకాశం ఇచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ పరిశ్రమల అధికారులను కోరారు. జిల్లా నోడల్‌ అధికారులుగా జిల్లా పరిషత్‌ సీఈవో, జిల్లా రెవెన్యూ అధికారి ఉంటారన్నారు. మొత్తం ఈకార్యక్రమాన్ని సోమవారం లోపల పూర్తి చేయాలని సెప్టెంబర్‌ 1 నుంచి ఎవరికి అప్పగించిన ఇంట్నెషిప్‌ కోర్సులలో వారు ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.రాజశేఖర్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌ రెడ్డి, ఎస్వీయూ రిజిస్టర్‌ హుస్సేన్‌, ఏసిలేబర్‌ డిపార్ట్మెంట్‌ ఓంకార్‌ రావు, డిప్యూటీ చీఫ్‌ ఇన్స్పెక్టర్‌ రామకష్ణరెడ్డి, జిఎండిఐసి చంద్రశేఖర్‌, డిఆర్‌డిఏ పిడి తులసి, మెప్మా టిఈ బాబా, తదితరులు పాల్గొన్నారు.