ప్రజాశక్తి-అనంతపురంసాంకేతిక విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాలు పెంచుకోవాలని జెఎన్‌టియు ఉపకులపతి రంగజనార్ధన పిలుపునిచ్చారు. స్థానిక జెఎన్‌టియు, ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డ్ కలిసి నిర్వహించిన బూట్ క్యాంపు ఆన్ డ్రోనీ టెక్నాలజీ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ట్రైనింగ్ కార్యక్రమాల వల్ల ఉపాధ్యాయులు తమకున్న విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా పెంపొందించుకోవడానికి, విద్యార్థులకు నూతన విషయాలను అర్థమయ్యేలా భోదించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతాయన్నారు. రిజిస్త్రార్ సి.శశిధర్ మాట్లాడుతూ వ్యవసాయానికి ఈ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని తెలిపారు. పంట పర్యవేక్షణ, తెగులు నియంత్రణ, నీటి పారుదల, ప్లాట్ విశ్లేషణ, పంట విశ్లేషణలో డ్రోన్‌లను ఉపయోగించవచ్చన్నారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న అధ్యాపకులకు సర్టిపికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ డైరెక్టర్లు బి.ఈశ్వర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.వి.సత్యనారాయణ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అరుణకాంతి, సమన్వయకర్తలు కె.కళ్యాణిరాధా, డి.విష్ణువర్ధన్, కె.వి.ఈశ్వర్‌మూర్తి, పీఆర్‌ఓ ఎం.రామశేఖరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అధ్యాపకురాలికి సర్టిఫికెట్ అందజేస్తున్న జెఎన్‌టియు విసి రంగజనార్ధన










