Apr 04,2023 21:58

అధ్యాపకులకు సర్టిఫికెట్లు అందజేస్తున్న దృశ్యం

         ప్రజాశక్తి-అనంతపురం  విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జెఎన్‌టి యు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ బి.ఈశ్వర్‌రెడ్డి సూచించారు. స్థానిక జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల కంప్యూటర్‌ సైన్సు విభాగం ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ శిక్షణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి, అధ్యాపకులు నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలకు ఎంతో ముఖ్య పాత్ర ఉందన్నారు. ఇలాంటి ట్రైనింగ్‌ ప్రోగ్రాంల వల్ల ఉపాధ్యాయులు, తమకున్న విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కోఆర్డినేటర్‌ పి.చెన్నారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సదస్సుల వల్ల నూతన అవిష్కరణలపై విద్యార్థులు, బోధనా సిబ్భందికి మంచి అవగాహన ఏర్పడుతుందన్నారు. అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు అందించడానికి ఉపాధ్యాయులు తమకున్న పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని విద్యార్థులకు బోధించాలని తెలిపారు. అనంతరం ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అధ్యాపకులకు సర్టిపికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బోధనా సిబ్బంది పాల్గొన్నారు.