Feb 23,2022 23:12

తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న రజక సంఘం నాయకులు

ప్రజాశక్తి- తొట్టంబేడు: మండలంలోని రజకులకు సంబంధించిన చాకలిమాన్యం భూములను ఇప్పించాలంటూ తొట్టంబేడు తహశీల్దార్‌కు రజక సంఘం నాయకులు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రజక రాష్ట్ర నాయకులు ఏలూరు సూర్య మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తొట్టంబేడు గ్రామంలో తమ చాకలి మాన్యం భూమిని భూ కబ్జాదారులు నుండి విముక్తి కల్పించి సర్వే నెంబర్‌ 77లోని భూమిని రజకులకు ఇప్పించాలని తహశీల్దార్‌ పరమేశ్వర స్వామికి తెలియజేశామన్నారు. స్పందించిన తహసీల్దార్‌ తమ సిబ్బంది ఆర్‌ఐ, విఆర్‌ వో, సర్వేయర్‌లను సంబంధిత స్థలానికి పంపించి తమకు సంబంధించిన భూములను చూపించడం హర్షణీయం అన్నారు. ఒక వారంలో హద్దులు చూపిస్తామని హామీ ఇచ్చారు.. తమ భూమిని పరిరక్షించుకోవడానికి రాబోయే రోజుల్లో ఉద్యమం చేయడానికి కూడా వెనుకాడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మురళి జిల్లా మహిళా అధ్యక్షురాలు యశోద, పాకాల రమేష్‌, ఆముదాల మురళి, భాస్కర్‌, బాబు, లక్ష్మణ్‌, డి.మురళి, దొడ్డరం సురేష్‌, ప్రకాష్‌, హరి, లోకేష్‌, వంశీ, తదితరులు పాల్గొన్నారు.