Jun 23,2023 12:46
  • జీకే కన్స్ట్రక్షన్స్ వ్యవస్థాపకులు కిషోర్ నాయుడు

ప్రజాశక్తి-ఎస్ఆర్ పురం(చిత్తూరు) : విద్యార్థులకు విద్యా సామాగ్రిని దాతలు జీకే కన్స్ట్రక్షన్స్ బెంగళూరు వ్యవస్థాపకుడు కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో త్యాగరాజుల నాయుడు కుమారి దంపతులు వారి కుటుంబ సభ్యులు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అందజేశారు .వివరాలు ఇలా.... ఎస్ఆర్ పురం మండలంలోని కటిక పల్లి గ్రామపంచాయతీ పిల్లి గుండ్లపల్లి గ్రామానికి చెందిన త్యాగరాజులు నాయుడు కుమారి దంపతులు జీకే కన్స్ట్రక్షన్స్ బెంగళూరు వ్యవస్థాపకులు కిషోర్ నాయుడు శుక్రవారం పిల్లి గుండ్లపల్లి దళితవాడ లో ప్రాథమిక పాఠశాలలోని ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు, పేద పిల్లలు బాగా చదివి ఉన్నత విద్యను అభ్యసించాలని ఉద్దేశంతో తన వంతు విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి ,ఉపాధ్యాయులు మురళి, కటికపల్లి మాజీ సర్పంచ్ బాబు నాయుడు మాజీ ఎంపీటీసీ కేఎం రవి కిషోర్ నాయుడు తల్లిదండ్రుల చేతులు మీదుగా పిల్లలకి విద్యా సామాగ్రిని అందించి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లికా గ్రామ పెద్దలు షణ్ముగం కృష్ణం నాయుడు శాంతి కుమార్ దేవరాజులు గంగాధరం, పవన్ కుమార్, దేవి, బాలకృష్ణ నాయుడు, దేవరాజు నాయుడు, గిరి తదితరులు పాల్గొన్నారు.