ప్రజాశక్తి-ఆచంట( పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలి పంచాయతీ పరిధి వర్ధనపు గరువు ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పాలకొల్లు సేవాసమితి ఆధ్వర్యంలో విశ్రాంతి ఉపాధ్యాయులు వర్ధనపు నాగేశ్వరరావు సమక్షంలో విద్యార్థులకు పెన్నలు పుస్తకాలు మరియు అల్పాహారాన్ని సోమవారం ఉదయం అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు వర్ధనపు నాగేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం విద్యార్థులు ఉపాధ్యాయుల చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గంటి బాబురావు, ఆ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చిట్టూరి దుర్గాప్రసాద్, వార్డ్ మెంబర్లు వర్ధనపు సుశీల, వర్ధనపు హరికృష్ణ, మానుకొండ శ్యామ్, ప్రధానోపాధ్యాయులు నిల్లా పూర్ణ కళాధర్ తదితరులు పాల్గొన్నారు.










