భవ్యశ్రీ మతికి కారకులైన వారిని అరెస్ట్ చేయాలి
పోలీసు స్టేషన్ ఎదుట
వడ్డెర సంఘం నాయకుల నిరసన
ప్రజాశక్తి -యాదమరి: మండలంలోని ఠాణా వేణుగోపాలపురం గ్రామంలో సంచలనం రేపిన భవ్యశ్రీ మతికి కారకులైన నిందితులను తక్షణం అరెస్టు చేసి, కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రవీంద్ర రాజు, సీనియర్ నాయకుడు మురగయ్య, వడ్డెర సంక్షేమ సంఘం సాధికార సమితి తిరుపతి జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్, వడ్డెర జే ఏ సి చైర్మన్ వేముల సుబ్బారావులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సంఘం నేతలతో కలిసి పెనుమూరు పోలీస్ స్టేషన్ ఎదుట భవ్యశ్రీ మతిపై న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భవ్యశ్రీ మతిపై అనుమానాలు ఉన్నాయని, మతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల అండదండలతో పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసు విచారణకు ప్రత్యేక అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు డీఎస్పీ శ్రీనివాస మూర్తి, దిశ డీఎస్పీ బాబు ప్రసాద్ లు పోలీస్ స్టేషన్ చేరుకుని నిరసన కారులతో మాట్లాడి భవ్యశ్రీ మతి కేసులో బాధితులకు న్యాయం చేస్తామని సర్ది చెప్పారు. అనంతరం ఘటనా స్థలాన్ని డీఎస్పీలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తురక అమర్నాథ్, కోశాధికారి సుబ్రమణ్యం, యువత అధ్యక్షుడు హరిబాబు, ప్రధాన కార్యదర్శి రుద్రయ్య, నేతలు తిరుమల, మకరందం, సుధాకర్, అశోక్, మణి, వాసు, శేఖర్ పాల్గొన్నారు.










