Aug 22,2023 23:28

భవన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి : జెసి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ప్రాధాన్యత భవనాల నిర్మాణాలకు, పేదలందరికీ ఇల్లు కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని లక్ష్య సాధనకు క్షేత్రస్థాయి నుంచి అందరూ కలిసి పనిచేసి సకాలంలో లక్ష్యాలను సాధించాలని జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు అన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ మంగళవారం హౌసింగ్‌ పీడీ పద్మనాభం, ఈఈ పంచాయతీరాజ్‌ చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీడీవోలు హౌసింగ్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న గ్రామసచివాలయ భవన నిర్మాణాలలో 73 శాతం భవనాలు పూర్తిచేయడం జరిగిందని, రానున్న మరో 15రోజుల లోపల మిగతా భవన నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా రైతుభరోసా కేంద్రాలకు సంబంధించి 73 శాతం భవనాలు నిర్మాణాలు పూర్తి అయ్యాయని, వైయస్సార్‌ హెల్త్‌క్లినిక్‌లు 56 శాతం పూర్తి అయ్యాయని, ప్రభుత్వ ఆశయాల మేరకు మిగతా నిర్మాణాలను పూర్తిచేసి సెప్టెంబర్‌ నెలాఖరి లోపల అన్నింటినీ అప్పగించాలన్నారు. ఈసందర్భంగా మండలాల వారీగా భవనాలు పెండింగ్‌ పనులు జరుగుతున్న స్థానాలను గురించి క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి డివిజనల్‌ స్థాయి అధికారులతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల గహనిర్మాణాలకు సంబంధించి చిత్తూరు జిల్లాకు 40వేల లక్యంకు ఇవ్వటం జరిగిందని ఇప్పటివరకు 39,621 గహాలను పూర్తి చేసుకోవడం జరిగిందని, అయితే లక్యంతో సంబంధం లేకుండా ప్రారంభించిన గహాలు అన్ని పూర్తి అయ్యేంత వరకు పనులను వేగవంతం చేయాలన్నారు. స్టేజీలవారీగా కన్వర్షన్‌ వేగవంతంగా జరగాలని ప్రభుత్వ లక్ష్యాలను పూర్తిచేయించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు.