ప్రజాశక్తి-గుత్తి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలను త్వరగతిన పూర్తిచేయాలని పంచాయతీరాజ్ శాఖ చీఫ్ ఇంజినీర్ బి.బాలునాయక్ ఆదేశించారు. ఆదివారం స్థానిక మండలంలోని ఉబిచెర్ల, పామిడి మండలంలోని ఖాదర్‌పేట గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న ప్రాధాన్యత భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణాలను నాణ్యతతో చేపట్టాలన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో ఉండాలన్నారు. భవనాలను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఎస్‌ఇ వై.భాగ్యరాజ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చంద్రశేఖర్, డిఇఇ డిఎల్. మురళీధర్, ప్రాజెక్టు డిఇఇ కెవి. ప్రసాద్, క్వాలిటీ కంట్రోలు డిఇఇ భరత్ ప్రకాష్, పిఆర్ ఎఇ మల్లేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న పిఆర్ చీఫ్ ఇంజినీర్ బి.బాలునాయక్










