Nov 01,2023 21:35

పరిశీలిస్తున్న కలెక్టర్‌

పరిశీలిస్తున్న కలెక్టర్‌
భవన నిర్మాణ స్థల పరిశీలన
ప్రజాశక్తి-నెల్లూరు:నగరంలోని నీలగిరి సంఘం తెలుగుగంగ ప్రాజెక్టు అతిధి గృహం ప్రాంగణంలో బాల సదన్‌ భవన నిర్మాణానికి స్థలాన్ని కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ పరిశీలించారు. బుధవారం తెలుగు గంగ ప్రాజెక్టు అతిథి గృహ ప్రాంగణంలో బాలసదన్‌ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌తో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. భద్రతాపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అన్ని విధాల అనుకూలమైన సుమారు 50 సెంట్లు స్థలాన్ని బాల సదన్‌ నిర్మాణానికి కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సిఎస్‌ ఆర్‌ నిధులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. కార్యక్రమంలో రూరల్‌ తహశీల్దార్‌ సోమ్లా నాయక్‌, సర్వేయర్‌ ఏడుకొండలు ఉన్నారు.