ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: సంక్షేమ పథకాలు అమలు చేసి భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మేనిరాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక లేబర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ రంగ కార్మికులతో కలిసి మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మునిరాజా మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం కంచే చేనుమేసిందన్న చందంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మిక సంక్షేమ నిధులను పక్కదోవ పట్టిస్తూ వారి జీవితాలను వీధిపాలు జేసిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలో తీవ్రమైన ఇసుక సంక్షోభం, కరోనా లాంటి విపత్కర పరిస్థితులను భవన నిర్మాణరంగ కార్మికులు ఎదుర్కొన్నారనీ, పనుల్లేక, ఆకలిని తట్టుకోలేక 30 మది కార్మికులు మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమ ర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెమోలు 12, 14లను తొలగించి కార్మికుల సంక్షేమానికి పాటుపడాలని కోరారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి పెనగడం గురవయ్య, గంధం మణి, బాలగురవయ్య, దేశయ్య తదితరులు పాల్గొన్నారు.










