ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : భూ వివాదాలకు చెక్ పెట్టాలన్న ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభు త్వం రీ సర్వే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వే కా ర్యక్రమం ఎలా సాగుతోందో తెలియదు గానీ.. తోటపల్లిగూడూరు మండలంలో చేపడుతున్న రీ సర్వే ప్రక్రియలో చిత్ర,విచిత్రాలు కనిపిస్తున్నాయి.తప్పులు తడకలుగా సాగుతున్న రీ సర్వేతో రైతు లు తలలు పట్టుకొంటున్నారు. మండంలోని చిన్నచెరుకూ రు గ్రామానికి చెందిన మాగుంట విజయభాస్క ర్ రెడ్డి 15 సంవత్సరాల కిందట మృతిచెందారు.ఆ రైతు తా ను జీవించివున్న కాలంలో కూడా పట్టాదార్ పా స్ పుస్తకం కోసం కనీసం దరఖాస్తు కూడా చేసు కోలేదు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే 15 ఏళ్ల కిందట చనిపోయిన విజయ భాస్కర్ రెడ్డి పే రుతో తాజాగా చేపట్టి రీ సర్వేలో ఖాతా నెంబర్ 602, ఎల్.పి నెంబర్ 240లో 0.84 ఎకరాల భూమి ఉననట్లు రెవెన్యూ శాఖ అధికారులు పట్టా దార్ పాస్ పుస్తకాన్ని సిద్ధం చేయడం గమనర్హాం. పాపిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రై తు గంగపట్నం రంగారెడ్డి నరుకూరు సర్వే నంబ ర్ 171లోని 1.80 ఎకరాల భూమిని నీలకంఠం రవీంద్రారెడ్డి అనే రైతుకు విక్రయించారు. రీ సర్వే ప్రకారం 1.80 ఎకరాలుగా వున్న ఈ భూమి విస్తీర్ణం పట్టాదార్ పాసుపుస్తకంలో 1.88 ఎకరాల విస్తీర్ణంగా నమోదు కావడం గమనార్హం.










