కాళ్ల:ఏలూరుపాడులో తాగునీటి వనరులను పరిరక్షించాలని గ్రామస్తులు ఇటీవల గ్రామ సర్పంచి, పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏలూరుపాడు గ్రామ కార్యాలయంలో గ్రామస్థుల అభ్యర్థన మేరకు పంచాయతీ సాధారణ సమావేశం సర్పంచి భూపతి రాజు వెంకట జగ్గరాజు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో భూగర్భ జలాల పరిరక్షణకు సర్వే నంబర్ 225 నుండి 248 వరకూ పంచాయతీ తాగునీటి చెరువుకు అనుకుని ఉన్న పంట భూముల్లో ఆక్వా చెరువుల తవ్వకాలు నిలిపివేయాలని, తాగునీటి చెరువును, భూగర్భ జలాలను పరిరక్షించాలని పంచాయతీలో తీర్మానం చేశారు. గ్రామ సర్పంచి భూపతి జగ్గరాజు, ఉపసర్పంచి నల్లగచు ధనలక్ష్మి, పంచాయతీ వార్డు సభ్యులు వరలక్ష్మీ, ఆంజనేయులు, తలగల్ల సుబ్బారావు, సామన కమలకుమరి, చిన్న అమ్ములు తీర్మానం చేశారు










