ప్రజాశక్తి - పాలకోడేరు
భూ సమస్యల పరిష్కారానికి రీసర్వే ఎంతో దోహదపడుతుందని విస్సాకోడేరు గ్రామ సర్పంచి బొల్లా శ్రీనివాస్ అన్నారు. గ్రామంలో బుధవారం డ్రోన్ రీ సర్వే ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఈ డ్రోన్ రీ సర్వేను సర్పంచి శ్రీనివాస్ సందర్శించి గ్రామానికి సంబంధించిన భూ వివరాలను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా సర్పంచి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ సమస్యల పరిష్కారానికి భూ రక్షణకు రీసర్వే చేపట్టిందన్నారు. సొంత భూములు, వివిధ రకాల పంటల ఆయకట్టు, ప్రభుత్వ భూములకు సంబంధించిన విస్తీర్ణం వంటి వివరాలన్నీ ఈ సర్వే ద్వారా పొందుపర్చడం జరుగుతుందన్నారు. రీసర్వేకు గ్రామస్తులు, రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీసర్వే డిఎ రాంబాబు, రీసర్వే డిప్యూటీ తహశీల్దార్ సూర్యనారాయణరాజు, మండల సర్వేయర్ శ్రీనివాసరావు, ఉపసర్పంచి కందుల నాగరాజు, కోఆప్షన్ సభ్యులు డిఆర్ స్వర్ణలత, మాజీ సర్పంచి పెనుమత్స శ్రీనివాసరాజు పాల్గొన్నారు.










