Nov 29,2022 21:57

వీడియో కాన్పెరెన్స్‌లో మాట్లాడుతున్న జేసి

భూ సేకరణ పరిహారం అంచనాలు పంపండి : జేసీ
చిత్తూరుఅర్బన్‌ :
జిల్లాలో నిర్మించ తలపెట్టిన పలు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతం చేసేందుకు పరిహారం అంచనాలను పంపాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు. మంగళ వారం సాయంత్రం పలమనేరు అర్‌ డి ఓ రామకష్ణా రెడ్డి, చిత్తూరు అర్‌ డి ఓ రేణుక, తహశీల్దార్లు సదుము, సోమల, రొంపిచర్ల, పులిచర్ల, పుంగనూరు లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ వేగవంతంగా పరిహారం వరకు ప్రక్రియను ముగించాలని అన్నారు. నిర్ణయించిన మేరకు ప్రతిపాదనలు పంపాలన్నారు.