ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
శుక్రవారం తిరుపతి ప్రెసక్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన దివంగత వెంకటరమణ హాయంలో తిరుపతిలో ఉపాద్యాయనగర్ 11/2బిలో లేఅవుట్ వేయ్యలేదా అని ప్రశ్నించారు. అర్బన్ హట్ వద్ద కబ్జాలకు పాల్పడలేదా, ఎస్సీల భూములను బినామీలుగా ఉంటూ అనుభవించడం లేదా అని ప్రశ్నించారు. తిరుపతిలో శాసనసభ్యుడిగా ఎన్నికైన తరువాత భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతిలో ఎవ్వరూ భూ కబ్జాలకు పాల్పడిన, సంఘం వ్యతిరేక కార్యక్రమాలను చేసిన సహించేది లేదని అనాడే స్పష్టం చేశారన్నారు. తిరుపతి నగరంలో మాధవ ద్రవ్యాల కట్టడికి ఎమ్మెల్యే పాదయాత్రగా తిరునగరిలో కలియ తిరగలేదా, కైన్సిలింగ్‌లు ఇచ్చారని, కేవలం బురదజల్లే కార్యక్రమాలను టీడిపి నేతలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి ఉపసర్పంచ్ రామకృష్ణ, మనోజ్, మని, వెంకి, పాండు పాల్గొన్నారు.










