Jun 28,2023 21:09

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
భీమవరంలో జనసేన జెండా ఎగరాలని దీనికి జన సైనికులు మరింత కష్టపడాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాలమండలం పెదమిరంలో ఉన్న నిర్మల ఫంక్షన్‌ హాల్‌ లో మంగళవారం సాయంత్రం భీమవరం నియోజవర్గ జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తను పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భీమవరంలో మన జెండా ఎగరాలని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో వైసిపి జెండాను ఎగరనీయకుండా గట్టి ప్రయత్నం చేయాలి అన్నారు. నాకు అనారోగ్య ఉన్నప్పటికీ మీ మీద ప్రేమతో ఈ సమావేశం హాజరైనన్నారు. భీమవరం లో ఉన్న కస్తూరిబారు కాలేజీకి దేశ నేతల పేర్లు మార్చడం సరికాదు అన్నారు. ఈనెల30 నా భీమవరంలో జరగనున్న బహిరంగ సభలో అన్ని సమస్యల పైన అన్ని విషయాల పైన మాట్లాడతానని పేర్కొన్నారు. ధైర్యం లేకపోతే రాజకీయాల్లో రాణించలేమని యువత ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ రెండు రోజుల్లోనే రేపటినుండి వైసీపీలో మరిన్ని తప్పులు చేస్తారని విమర్శించారు. నాతో అనిపించకుండా వైసిపి వాళ్ళు ఉండలేరన్నారు. అలాగే నేను కూడా ఇకనుండి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా హావభావాలు ఇస్తానన్నారు. జగన్మోహన్‌ రెడ్డి మాదిరిగా పవన్‌ తన ఆవాలను పలికించి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ కి అ ఆ లు, ఆకారం లు రావని భవిష్యత్తులో జగన్‌ కు నేర్పిస్తామన్నారు. మీరు ముఖ్యమంత్రి లేక ఏంటో అర్థం కావట్లేదు అమ్మ ఒడి పథకంలో కార్యక్రమంలో మీ మాటలు చూస్తే తెలుస్తుంది. నేను చెప్పు తీసి చూపించాను అంటే దాని వెనకాల చాలా కథ వ్యవహారం జరిగిందని అందువల్లే చెప్పు చూపించనున్నారు. పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఇంగిత జ్ఞానం లేదు..కేవలం పవన్‌ కళ్యాణ్‌ ను విమర్శించడానికి ఆరు కోట్లుప్రజాధనాన్నిఖర్చుపెట్టిసభపెట్టారుఅనివిమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి సిగ్గుండాలి
పాఠశాలల విద్యార్థుల సభలో ఇంగిత జ్ఞానం లేకుండా పవన్‌ కళ్యాణ్‌ పై ఆరోపణలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ లారీ ఎక్కితే మీకేంటి, మీరు హెలికాప్టర్లో తిరుగుతున్నారు కదా, ఏదో ఒక రోజు మీరు లారీ, కార్లపై తిరగాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యల పై దష్టి సారించకుండా పవన్‌ కళ్యాణ్‌ పై ఆరోపణ చేయడమే పనిగా పెట్టుకున్నారు. 2024లో వైఎస్‌ఆర్సిపి కి ఎక్స్పైరీ డేట్‌.. ఇక ఆ మందు చెల్లదన్నారు. ఏజెన్సీ నుండి గంజాయి వస్తుంది, రాష్ట్రం నలువైపులా ఏ విధంగా పోతుంది... దానికోసం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎందుకు మాట్లాడరు.వై ఎస్‌ ఆర్‌ సి పి నాయకులు ఇసుకలోను గంజాయిలోను, లిక్కర్‌ లోనూ కూరుకు పోయారని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి పవన్‌ ను టార్గెట్‌ చేస్తున్నారు. ధైర్యంగా నిలబడు, ప్రజల్లోకి వచ్చి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఉత్తేజపరిచేందుకు ప్రశ్నించమని పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్నారు. ఇటువంటి దుర్మార్గపు నాయకులను ఇంటికి పంపించాలని అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, నాయకులు కనకరాజు సూరి, మళ్లీ నీడి బాబి, ఎర్రింకి సూరి రావు, చలమలచెట్టు చంద్రశేఖర్‌, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.