Apr 27,2023 23:34

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
         భీమవరం హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ శ్రీ వెంకట సాయిబాబా మందిరం 12వ వార్షికోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర పిఎసి ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విశేష పూజలు నిర్వహించారు. మందిరం వ్యవస్థాపక ఛైర్మన్‌, కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్‌ నాయకులు మల్లినీడి తిరుమలరావు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జనసేన ఉంగుటూరు ఇన్‌ఛార్జి పచ్చమట్ల ధర్మరాజు ఏర్పాటుచేసిన వాటర్‌ ట్యాంకర్లను నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను మల్లినీడి తిరుమలరావు శాలువా కప్పి వెండిగ్లాసు బాబావారి చిత్రపటంతో సత్కరించారు.