Oct 08,2023 21:29

ఫొటో : మాట్లాడుతున్న కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి

భగత్‌సింగ్‌లా పోరాడాలి
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ : స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌లా ప్రతిఒక్కరూ పోరాటం చేసి టిడిపిని గెలిపించి నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 4, 6, 7వ డివిజన్లో ఆదివారం టిడిపి నూతన కార్యాలయాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. టిడిపి విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. చంద్రబాబుకు అండగా నిలిచి దీక్షలను కొనసాగించాలన్నారు.
ప్రభుత్వంపై ప్రజలల్లో వ్యతిరేకత ఉందని రాబోయే ఎన్నికల్లో టిడిపికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడేనని అన్నారు. వైసిపి ప్రభుత్వం అభివృద్ధి మరిచి అరాచకాలతో పాలన సాగిస్తుందన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు మామిడాల మధు, అన్నపూర్ణ, నారాయణ, మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.