Mar 23,2023 21:07

గణపవరం : భగత్‌ సింగ్‌ జీవితం యువతకు ఆదర్శమని గణపవరం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్‌ పి.నిర్మలకుమారి అన్నారు భగత్‌సింగ్‌ వర్థంతి సభను స్థానిక కాలేజీలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ పి.మధు రాజు, అధ్యాపకులు, అక్కిరాజు, స్వరూప రాణి, వెంకట్రావు, రమేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.
పాలకొల్లు : పట్టణంలోని జివిఎస్‌విఆర్‌ఎం మున్సిపల్‌ పాఠశాలలో ఆర్‌సిఐ పాలకొల్లు రైజింగ్‌ క్లబ్‌ వారిచే భగత్‌సింగ్‌ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మౌని కావలి మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ చరిత్ర నింపిన వీరులు భగత్‌సింగ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో వసంత లక్ష్మి, రేపాక మీనామణి, దీప్తి, హెచ్‌ఎం రాయపూడి భవానీ ప్రసాద్‌, శశికళ, త్రిమూర్తులు పాల్గొన్నారు.
ఆకివీడు : భగత్‌ సింగ్‌ వర్ధంతి సందర్భంగా స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ప్రజా సంఘాల కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకూ కాగడాలతో కార్యకర్తలు ప్రదర్శనగా వచ్చారు. భగత్‌సింగ్‌, రాజుగురు సుఖదేవులకు ఈ సందర్భంగా కార్యకర్తలు నివాళులర్పించారు. కార్యక్రమంలో గేదెల ధనుష్‌, డి.రవితేజ, బివి.వర్మ, ఎడవల్లి రాంబాబు పాల్గొన్నారు.