Mar 23,2023 09:13

ప్రజాశక్తి-కాళ్ల : నేటి యువత భగత్ సింగ్ ఆశయాల కోసం పనిచేయాలని సిపిఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ అన్నారు.గురువారం సిపిఎం కాళ్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి జరిగింది నిర్వహించారు. కాళ్ల బస్టాండ్ సెంటర్లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ మాట్లాడుతూ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలను తునప్రాయంగా అర్పించారని, నేటి యువతి,యువకులు భగత్ సింగ్ ఆశయాల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. నేడు భారతదేశ ప్రమాదంలో ఉందని దేశ సంపదను కేంద్ర ప్రభుత్వం ఒక్కరిద్దరికి దోశ పెడుతుందని విమర్శించారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజల మీద ఉందన్నారు.యావత్  భగత్ సింగ్ ఆశ సాధనలో భారతదేశాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండా సూరిబాబు, తిరుమానిశ్రీను, పుట్టబోతుల మధు,నిమ్మల అంజి  తదితరులు పాల్గొన్నారు.