ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లులో విలీనమైన భగ్గేశ్వరం ఏరియాలో మున్సిపల్ అధికారులతో కలిసి జెడ్‌పి ఛైర్మన్ కవురు శ్రీనివాస్ శుక్రవారం పర్యటించారు. గ్రామంలో పలు చోట్ల సీసీ డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బిఆర్‌ఎస్.శేషాద్రి, జెడ్‌పిటిసి నడపన గోవిందరాజులు, మండల కన్వీనర్ మైఖేల్ రాజు నాయకులు పాల్గొన్నారు.










