భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
ప్రజాశక్తి- నగరి: ముఖ్యమంత్రి నగరి పట్టణానికి ఈనెల 28న విచ్చేయడాన్ని పురస్కరించుకొని భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రిషాంత్ రెడ్డి పరిశీలించారు. మంగళవారం నగరి పట్టణానికి విచ్చేసిన ఆయన కీళపట్టు, డిగ్రీకళాశాల మైదానాల్లో ఏర్పాటు చేసే హెలిప్యాడ్‌లను ఎస్పీ పరిశీలించారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి చేరుకునే మార్గాలను పరిశీలించి ఆ ప్రాంతాల్లో చేపట్టవలసిన భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. రోడ్‌షో నిర్వహించే సమయంలో భద్రతా అంశాలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. డీఎస్పీ రవికుమార్, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ సురేష్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










