ప్రజాశక్తి-ఆనంతపురం భావి ఇంజినీర్లు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని జెఎన్‌టియు ఉపకులపతి రంగజనార్ధన పిలుపునిచ్చారు. జెఎన్‌టియు ఇంజినీరింగ్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మోడ్రన్ డే బ్రిజస్ అండ్ మెట్రో స్ట్రక్చర్ అనే అంశంపై ప్రిన్సిపాల్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షత ఒక్క రోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈకార్యక్రమాన్ని విసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ ప్రపంచంలో రెండవ అతిపెద్ద రహదారి కలిగిన దేశం భారత్ అన్నారు. ఇలాంటి సదస్సులను అధ్యాపకులు, విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. ముఖ్యంగా భావి ఇంజినీర్లు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్‌స్ట్యూస్ ఆఫ్ బ్రిజ్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ వినరు గుప్తా, కోఆర్డినేటర్ పి.ఆర్.భానుమూర్తి, రిజిస్ట్రార్ సి.శశిధర్, వైస్ ప్రిన్సిపాల్ ఇ.అరుణ కాంతి, సివిల్ విభాగం ఆచార్యులు హెచ్.సుదర్శనరావు, ఆచార్య వైశాలి ఘోర్పడే, విభాగాధిపతులు ఎస్.చంద్రమోహన్‌రెడ్డి, ఎం.రామశేఖరరెడ్డి, కె.ఎఫ్.భారతి, కళ్యాణి రాధ, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బ్యాటరీపై పరిశోధనలు జరగాలి
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటికి వినియోగిస్తున్న బ్యాటరీలపై పరిశోధనలు చేయాలని జెఎన్‌టియు ఉపకులపతి రంగజనార్ధన సూచించారు. శుక్రవారం స్థానిక జెఎన్‌టియు ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్యాకల్టీ డెవలప్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో డిజైన్ అండ్ డెవెలప్ మెంట్ ఆఫ్ పవర్ కాన్వర్ట్ ఫర్ ఎలక్ట్రక్ వెహికల్స్ అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో అధ్యాపకులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ సి.శశిధర్, కళాశాల ప్రిన్సిపాల్ యస్.వి.సత్యనారాయణ, ప్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం డైరెక్టర్ బి.ఈశ్వర్‌రెడ్డి, కన్వీనర్ యం.రామశేఖరరెడ్డి, కోఆర్డినేటర్లు శ్రీనివాసులు, అంకారావు, కలికిరి ఈఈఈ విభాగ అధిపతి బి.జితేంద్రగౌడ్, యస్.శ్రీధర్, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జెఎన్‌టియు ఉపకులపతి రంగజనార్ధన










