తాడిపత్రి రూరల్ : భార్యను రోకలిబండతో కొట్టి హత్య చేసిన ఘటన మండల పరిధిలోని వెలమకూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని వెలమకురు గ్రామానికి ఓబుళరెడ్డి, నారాయణమ్మ (75) దంపతులు గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండటంతో ఇద్దరికీ పెళ్లిళ్లు చేశారు. దీంతో భార్యాభర్తలు కాపురం ఉండేవారు. ఈనేపథ్యంలో కొంతకాలంగా ఓబులరెడ్డి ఆరోగ్య పరిస్థితి సరిగా లేక బాధపడుతున్నాడు ఆ క్రమంలో భార్య నారాయణమ్మతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గొడవ పడి ఇంట్లోని రోకలిబండతో తలపై గట్టిగా కొట్టి హత్య చేశాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఓబుళరెడ్డిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
హత్యకు గురైన నారాయణమ్మ










