Oct 18,2020 07:58

సమాజాన్ని విప్లవాత్మకంగా పరివర్తన గావించాలన్న పార్టీ లక్ష్యం వర్గ, ప్రజా ఉద్యమాలతో ముడిపడి ఉంది. పార్టీ చరిత్రను అధ్యయనం చేస్తే మనకు గత అనుభవాలు, ముఖ్యమైన గుణపాఠాలు ఆయుధాలుగా లభిస్తాయి. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలు తమ కాలంలో మార్క్సిస్టు- లెనినిస్టు సిద్ధాంతాన్ని భారత దేశ నిర్ధిష్ట పరిస్థితులకు అన్వయించడంలో చేసిన కృషి, గడించిన అనుభవాలు మనకు మంచి సంపద. ఉద్యమాన్ని అర్థం చేసుకోవడంలోనూ, మన కర్తవ్యాలను ముందుకు తీసుకుపోవడంలోనూ అవి మనకు తోడ్పడతాయి.