May 04,2023 14:56

ప్రజాశక్తి - పెనుమంట్ర : ఆన్లైన్ ఉద్యోగ అవకాశాలు పట్ల చదువుకున్న యువకులు, ఉద్యోగస్తులు, టీచర్లు అప్రమత్తంగా ఉండాలని డి.ఎస్.పి కె రవి మనోహరా ఛారి అన్నారు. గురువారం స్థానిక స్టేషన్ సందర్శించి మహిళా పోలీసుల పనితీరు పరిశీలించారు. ఈ సందర్భంగా రవి మనోహరా ఛారి  మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఒంటరి మహిళలను, తల్లిదండ్రులు గాని, భర్త గాని ఉపాధి నిమిత్తం బయట దేశాలకు వెళ్ళినప్పుడు కొంతమంది మిస్ అవుతున్నారని తెలిపారు. ఇవి జరగకుండా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా బ్యాంకు లావాదేవీ మోసాలు పాడ్పడేవారు ఫోన్ చేసి ఓటిపి, ఈకేవైసీ, కొన్ని యాప్ డౌన్లోడ్ చేసుకోమని వచ్చే మెసేజ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది చదువుకొన్న యువకులకు, సాఫ్ట్వేర్ చదువుకున్న ఉద్యోగస్తులకు , మరి ముఖ్యంగా టీచర్లకు ఫోన్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయటం పరిపాటిగా మారిందని అన్నారు. అంతేగాని మామూలుగా పని చేసుకునే యువకుల మాత్రం ఈ ఆన్లైన్ ఉద్యోగ విషయంలో ఎక్కడ మోసపోవడం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఆయనతో పాటు ఎస్సై బి సురేంద్ర కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.