Apr 24,2023 15:43

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో, వెదురు కుప్పం మండలంలో జాతీయస్థాయి పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మండలంలో ఉత్తమ పంచాయతీలను ఎన్నుకోవడం జరిగింది. 25 పంచాయతీలలో ప్రధమంగా సంతబయలు పంచాయతీ అన్నింటిలో ముందంజలో ఉంది. ఎంపీడీవో కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి సుధాకర్ రావు చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాన్ని సోమవారం సంతబయలు సర్పంచ్ రాజేశ్వరీ పెద్దారెడ్డి అందుకొన్నారు. ఆమెను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండి నాగరాణి, మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కామసాని పద్మనాభరెడ్డి జడ్పిటిసి సుకుమార్, జిల్లా వైఎస్ఆర్సిపి స్టీరింగ్ కమిటీ సభ్యులు శివాజీ తదితరులు ఉన్నారు