Jun 01,2023 13:22

ప్రజాశక్తి-ఉండి: ప్రతి విద్యార్థి పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని ఏంజెల్ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు పి నందిని సూచించారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా గురువారం ఉండి మండలం యండగండి శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు మెహందీ డిజైన్లపై ఏంజెల్ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు పి నందిని చే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పి నందిని మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పోటీ తత్వాన్ని అలవర్చుకోవడం వలన విద్యార్థికి ఇచ్చే శిక్షణ పై పట్టు సాధించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ శిబిరంలో విద్యార్థినిలు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల డిజైన్లు నేర్చుకున్నారని ఆమె తెలిపారు. మెహందీ డిజైన్లు, బ్యూటీ పార్లర్ కోర్సులు ప్రతి విద్యార్థిని నేర్చుకోవడంతో ఎవరి మీద ఆధారపడకుండా డబ్బులు సంపాదించుకోవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారి ఎన్ సి హెచ్ రామకృష్ణ, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వేగేశ్న సత్యరాజ్, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.