ఓటేస్తున్న దృశ్యం
బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్:రాష్ట్రంలోవిద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆత్మకూరు సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు పేర్కొన్నారు. పట్టణంలోని పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ప్రజా బ్యాలెట్ ఓట్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంట లక్ష్మీపతి మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి , కరెంటు ఛార్జీలు పెంచింది. 2014లో పెంచిన ట్రూ ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుందని అన్నారు. ట్రూ ఛార్జీల పేరుతో ఇంధనం చార్జీల పేరుతో , సర్దుబాటు చార్జీల పేరుతో, అనేక భారాలు వేసి , ఇవాళ కరెంటు చార్జీలు 3,4 రెట్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారాల మోపడం అత్యంత దారుణమని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం నాగేంద్ర, సాలరుద్దీన్, డివైఎఫ్‌ఐ నాయకులు నంద, శీను పాల్గొన్నారు.










