ఫొటో : మాట్లాడుతున్న తహశీల్దార్ సానా శ్రీనివాసులురెడ్డి
బూత్‌స్థాయి అధికారులతో సమీక్ష
ప్రజాశక్తి-ఉదయగిరి : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి బూత్ లెవెల్ అధికారులతో శుక్రవారం తహశీల్దార్ సానా శ్రీనివాసులురెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. చనిపోయిన వారిని గుర్తించి ఓట్లు తొలగించాలని ఇంటి డోర్ నెంబర్లు కచ్చితంగా వేయాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల ఎన్నికల డిప్యూటీ తహశీల్దర్ శ్యామ్, లలితమ్మ సీనియర్ అసిస్టెంట్ సంధాని, జూనియర్ అసిస్టెంట్, మండల స్థాయి బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.










