May 07,2023 21:16

విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శివరామిరెడ్డి

           ప్రజాశక్తి-బెలుగుప్ప   మండలంలోని బూదిగుమ్మ సమీపంలో రిజర్వాయర్‌ నుంచి కృష్ణాజలాలు దెబ్బతిన్న బ్రిడ్జి నిర్మాణానికి రూ.53 కోట్లు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తెలిపారు. ఈమేరకు ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బెలగలేశ్వరస్వామి, యల్లమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్సీ హాజరై మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రిజర్వాయర్‌ నీటితో బూదిగుమ్మ సమీపంలో బ్రిడ్జి దెబ్బతినడంతో రాకపోకులకు అంతరాయం ఏర్పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. విషయాన్ని సిఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వెంటనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా గుంతకల్లు నుంచి ఉరవకొండ, బెలుగుప్ప, కళ్యాణదుర్గం మీదుగా కర్ణాటక రాష్ట్రం పావుగడకు జాతీయ రహదారిని అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సహాయ కేంద్ర రైల్వే శాఖ నుంచి గుంతకల్లు, ఉరవకొండ, బెలుగుప్ప, కళ్యాణదుర్గం లింకు రైల్వే రోడ్డు కలపనున్నట్లు తెలిపారు. కాగా సిఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు రమణ, సింగిల్‌విండో అధ్యక్షులు శివలింగప్ప, బోయ వెంకటేశులు, బీసీ మోహన్‌, రామాంజనేయులురెడ్డి, పరమేశ్వర్‌, గుండ్లపల్లి అంజన్‌రెడ్డి, జీడిపల్లి రాజు, రఫీ, మస్తాన్‌, బసవరాజు, సోంపల్లి ఎర్రిస్వామి, గంగ్యానాయక్‌, బిహెచ్‌ చౌదరి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.