Jun 29,2023 21:28

సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు

              ప్రజాశక్తి-శింగనమల   నాలుగేళ్లుగా రాష్ట్రంలో వైసిపి అరాచక పాలనను ఎండగట్టేందుకు టిడిపి చేపట్టిన బస్సుయాత్రలను విజయవంతం చేయాలని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బండారు శ్రావణిశ్రీ పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలోని శ్రావణీ ని వాసంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకు ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలోని ప్రవేశించను న్న బస్సుయాత్రను గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, శింగనమల, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండ లాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైసిపి ప్రభుత్వం చేస్టున్న అరాచకాలను ఎండగట్టడంతోపాటు రాబో యే 2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో పసుపు జెండాను ఎగురవేసేందుకు టిడిపి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. మహానాడులో టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జిసి.బాబు, మాజీ జెడ్పిటిసిటిసి చిదంబర దొర, నాయకులు చిదానందనాయుడు, బోయ సత్తి, మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.