Feb 24,2022 22:35

పీలేరు ఆర్టీసీ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌కు వినతి పత్రం అందజేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి-యర్రావారిపాలెం:మండలంలో పలు గ్రామాల నుండి పీలేరుకి వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బొమ్మల జగదీష్‌ కోరారు. గురువారం ఆయనతో పాటు పలువురు విద్యార్థులు పీలేరు ఆర్టీసీ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలకు వెళ్లే సమయానికి అనుకూలంగా బస్సులను నడపాలన్నారు. ఎర్రవారిపాలెం మండలం నుండి దాదాపు 60 నుంచి 70 మంది విద్యార్థులు పీలేరుకు ప్రతి రోజు కళాశాలకు వెళ్ళి వస్తూ ఉంటారన్నారు. ఇంతకుముందు బస్సు సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి తలపుల, ఎల్లమంద, బోడెవాండ్ల పల్లికి వచ్చేదని, కానీ ఇప్పుడు బయలుదేరే సమయం సాయంత్రం 6:00 చేయడంతో విద్యార్థులు బస్సులో రావడానికి ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలియజేశారు. విద్యార్థులకు అనుకూలంగా బస్సు సమయాన్ని కేటాయించి నడుపవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సబీర్‌, మురుగేశ్‌, వెంకటేష్‌, మల్లి, బాలాజీ విద్యార్థులు పాల్గొన్నారు.