షెల్టర్‌లేని దృశ్యం
బస్ షెల్టర్ లేక ప్రయాణికుల అవస్థలు
నిద్రావస్థలో అధికారులు
ప్రజాశక్తి-వరికుంటపాడు:జిల్లా కేంద్రానికి 120కిలో మీటర్ల దూరంలో ఉండే వరికుంటపాడు నుంచి వివిధ ప్రాంతాలకు వందలాది మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు.వారంతా బస్ కోసం బస్టాండుకు చేరుకున్నప్పటికీ నిలువ నీడ లేకఅల్లాడు తున్నారు. తప్పని పరిస్థితిలో దుకాణాల ముందు బస్ కోసం నిలబడితే దుకాణదారులు చీదరించుకుంటున్నారు. మనసు చంపుకొని గత్యంతరం లేక దుకాణాల ముందే నిలబడి ప్రయాణాలు చేయాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. మండలంలో 24పంచాయతీలు, 56గ్రామాలున్నాయి. ప్రయాణికులే మన సంస్థకు నిది వారిని గౌరవించడం మన విధి అంటూ ప్రభుత్వాలు ఆర్టీసీ అధికారులు ప్రగల్బాలు పలుకుతున్నారే కానీ క్షేత్రస్థాయిలో కనీస సౌకర్యమైన బస్ షెల్టర్ ఏర్పాటుకు చేయాలన్న అలోచన వారికీ కలగక పోవడం ప్రయాణికులపై ఏ పాటి గౌరవం ఉందో అర్థమవుోంది. స్థానికంగా ఇటు ఆర్టీసీ అధికారులు గానీ, అటు పంచాయతీ పాలకవర్గం గానీ , టోల్గెట్ రూపంలో నగదు వసూలు చేస్తూ ప్రయాణికులకు వసతి ఏర్పాటులకు అలసత్వం వహిస్తున్న జాతీయ రహదారి మెయింటినెన్స్ యాజమాన్యం కానీ ఆ దిశగా అడుగులు వేయాలన్న ఆలోచన వారికి కలుగకపోవడం వారి నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది. ఇప్పటికైనా బస్టాండ్ కూడలిలోనీ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రయాణికులు వేచియుండు సము దాయాన్ని ఏర్పాటు చేయాలని వివిధ గ్రామాలకు చెందిన ప్రయాణి కులు కోరుతున్నారు.
బస్టాండ్ సౌకర్యం కల్పించాలి
చల్లగాలి వెంకట మోహన్
స్వగ్రామం నుంచి మరొకచోటికి ప్రయాణం చేయాలని బస్ కోసం బస్టాండుకు వస్తే నిలబడేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలి
సంచిబొయిన మధు కష్ణ
వరికుంటపాడులో సింగిల్ రోడ్డుగా ఉన్న సమయంలో బస్సు షెల్టర్ సౌకర్యం ఉంది. ఆ రోడ్డు కాస్త జాతీయ రహదారిగా విస్తరించింది. జాతీయ రహదారి ఏర్పాటు సమయంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణాలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
షెల్టర్ లేక అవస్థలు..
ఎస్.కె రజియ
సిఐటియు నాయకురాలు
వివిధ పనుల నిమిత్తం పలు గ్రామాల నుంచి వచ్చి తిరిగి స్వగ్రామాలకు చేరుకునే సమయంలో బస్టాండ్‌కు వస్తే బస్ కోసం నిలబడేందుకు ఎటువంటి వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎండా కాలంలోనే రోడ్డుపైనే బస్సు కోసం నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది. అదేవిధంగా సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు రాత్రి సమయాలలో వస్తే జాతీయ రహదారిపై ఉన్నటువంటి సెంట్రల్ లైట్ కూడా వెలగడంలేదు. దుండగల నుంచి ప్రమాదాలు పొంచి ఉన్నాయని మహిళలు బిక్కుబిక్కుమంటున్నారు. మహిళల మెడలలోని సరుడులను చోరీకి గురవుతున్న సంఘటనలున్నాయి.










