Oct 27,2023 21:18

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఐజాక్‌ ప్రవీణ్‌

బోర్డులు ఏర్పాటుపై అవగాహన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేయడానికి డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌ తెలిపారు. మండలంలోని గ్రామ సచివాలయంలో సచివాలయ సిబ్బంది వలంటీర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌ మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు డిస్‌ప్లే బోర్డులు నవంబరు 1వ తేదీన బట్టేపాడు సచివాలయంలో, 2వ తేదీన నువ్వూరుపాడు సచివాలయంలో, 3వ తేదీన చెర్లోఎడవల్లి సచివాలయంలో ప్రజా ప్రతినిధులు, ప్రజల సమక్షంలో ఈ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమం గురించి ఆయా సచివాలయాల పరిధిలోని సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు ఎంపిడిఒ అవగాహన కల్పించారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమం గురించి మూడు రోజులు ముందుగా అన్ని కుటుంబాలకు తెలియజేసి కార్యక్రమం జరిగే రోజున అందరూ పాల్గొనేలా చూడాలన్నారు. ఆ రోజున తమ సచివాలయ పరిధిలోని కుటుంబాలకు ఏయే పథకం ద్వారా లబ్ధి పొందిన వివరాలను తెలుసుకొనవచ్చన్నారు. పథకాలు పొందడంలో ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రజా ప్రతినిధులు, అధికారులకు తెలియపరచి తగు పరిష్కారం పొందవచ్చని తెలిపారు.