ప్రజాశక్తి -నెల్లూరు :బండేపల్లి బ్రాంచ్ కెనాల్, కండలేరు నుంచి లింకు కెనాల్ పనులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రారంభించి రభీ సీజన్లో పంట సాగుబడి చేసే రైతంగానికి సాగునీరును పుష్కలంగా అందజే యాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా సమగ్రాభివద్ధి కోసం జరుగుతున్న సిపిఎం పాదయాత్ర మనుబోలు మండలానికి శనివారం ఉదయం చేరుకుంది. గొట్లపాలెం వద్ద ఈ పాదయాత్రకు మనుబోలు మండలం సిపిఎం సీనియర్ నాయకులు కటికాల వెంకటేశ్వర్లు, దేవదానం, భాస్కర్ ఆదిశేషయ్య పముజుల నరసయ్య మాసు వెంకటేశ్వర్లు ఇతర నాయకులు, కార్యకర్తలు పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. గొట్లపాలెం వద్ద జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్ రావు మాట్లాడారు. బండేపల్లి బ్రాంచ్ కెనాల్‌కు కండ లేరు నుంచి లింకు కెనాన్ పనులను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు పుష్కలంగా అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ పెంచిన కరెంటు చార్జీలు వెంటనే తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా సిఐటియు జిల్లా అధ్యక్షుడు టీవీ ప్రసాద్ జిల్లా కోశాధికారి కె పెంచల నరసయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆలూరు తిరుపాలు మాట్లాడారు..ఈ పాదయాత్ర మండలంలోని వడ్లపూడి, అక్కంపేట, పర్లపాడు, వీరంపల్లి ,మడమనూరు , నాయుడు పల్లి, తదితర గ్రామాలలో సాగింది. సిపిఎం నాయకులు ఎస్ కె. షాహినా బేగం ,కాలితి రెడ్డి రవణమ్మ, కిన్నెర కుమార్ పాల్గొన్నారు. పాల్గొన్నారు.










